కుప్పం , 27 జూలై (హి.స.) : 22 ఏళ్ల వయసులోనే ఆ యువకుడు సర్పంచిగా ఎన్నికయ్యాడు. నాలుగేళ్లపాటు ప్రజాసేవలో రాణించి దిల్లీలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు పిలుపు అందుకున్నారు.. కుప్పం మండలం ఎన్.కొత్తపల్లెకు చెందిన సర్పంచి కె.రాజశేఖర్. ఎంఏ చదివిన రాజశేఖర్ తెదేపా మద్దతుతో సర్పంచిగా గెలుపొందాడు. ‘హర్ ఘర్ జల్ యోజన’ కింద 90 శాతం ఇంటింటా నీటి కుళాయిల ఏర్పాటుకు కృషి చేశారు. అలాగే ‘పీఎం ఆవాస్ యోజన’ కింద 49 ఇళ్లు మంజూరు చేయించుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పిలుపురావడం అదృష్టంగా భావిస్తున్నానని ఆ యువ సర్పంచి చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ