తెలంగాణ, మహబూబ్నగర్. 27 జూలై (హి.స.)
వలసల జిల్లాగా ఉన్న మహబూబ్ నగర్ను ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేసేందుకు అందరి సహకారం అవసరమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గం ధర్మాపూర్ లోని ఆల్ మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన సందర్భంగా జీకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా పనిచేయాలి అని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న పదేండ్లలో జికె ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందాలని ఆయన ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు