కర్నూలు.జిల్లా కోడుమూరు.ప్రభుత్వాసుపతిలో 4.50 కిలోల బరువు తో.బాలుడు
అమరావతి, 27 జూలై (హి.స.: సాధారణంగా పిల్లలు 2.5 నుంచి 3.5 కిలోల బరువుతో జన్మిస్తారు. అటువంటిది కర్నూలు జిల్లా కోడుమూరు ప్రభుత్వాసుపత్రిలో 4.50 కిలోల బరువుతో బాలుడు జన్మించి, అందరినీ ఆశ్చర్యపరిచాడు. గోనెగండ్ల మండలం వేముగోడుకు చెందిన భారతికి పురిటి నొప్
కర్నూలు.జిల్లా కోడుమూరు.ప్రభుత్వాసుపతిలో 4.50 కిలోల బరువు తో.బాలుడు


అమరావతి, 27 జూలై (హి.స.: సాధారణంగా పిల్లలు 2.5 నుంచి 3.5 కిలోల బరువుతో జన్మిస్తారు. అటువంటిది కర్నూలు జిల్లా కోడుమూరు ప్రభుత్వాసుపత్రిలో 4.50 కిలోల బరువుతో బాలుడు జన్మించి, అందరినీ ఆశ్చర్యపరిచాడు. గోనెగండ్ల మండలం వేముగోడుకు చెందిన భారతికి పురిటి నొప్పులు రావడంతో భర్త నల్లన్న ఆస్పత్రిలో చేర్చారు. వైద్యాధికారి నాగరాజు పర్యవేక్షణలో డాక్టర్‌ పుష్పలత ఆమెకు సాధారణ ప్రసవం చేశారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande