రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే యూరియా ఇవ్వండి : మంత్రి తుమ్మల
తెలంగాణ, కొత్తగూడెం. 27 జూలై (హి.స.) రైతులపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారికి సరిపడా యూరియాని పంపిణీ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కొత్తగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేం
మంత్రి తుమ్మల


తెలంగాణ, కొత్తగూడెం. 27 జూలై (హి.స.)

రైతులపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారికి సరిపడా యూరియాని పంపిణీ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కొత్తగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వవలసిన యూరియాని సకాలంలో ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఏప్రిల్,మే, జూన్, జూలై నెలలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ఇవ్వాల్సిన యూరియాని ఇవ్వకపోగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసు పాలు చేస్తుందన్నారు. బీజేపీ నాయకులకు అవగాహన లేకపోతే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర వివరాలు తెప్పించుకోవాలని సూచించారు. ఇవ్వాల్సిన యూరియాని ఇవ్వకుండా, రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ప్రణాళిక ప్రకారం 6.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని సరఫరా చేయాల్సి ఉండగా,4.23 మెట్రిక్ టన్నుల యూరియాని మాత్రమే సరఫరా చేసిందని,2.37 మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఉందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 36% యూరియా లోటు ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్ర ప్రభుత్వం రానున్న నాలుగైదు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రైతులకు యూరియాని సరఫరా చేయాలని తెలిపారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ మంత్రులను కలిసి యూరియా సరఫరా చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande