కొండాపూర్లో రేవ్ పార్టీ భగ్నం.. తొమ్మిది మంది అరెస్ట్
హైదరాబాద్, 27 జూలై (హి.స.) హైదరాబాద్ నగరంలో మరో రేవ్ పార్టీ వెలుగు చూసింది. కొండాపూర్లో ఓ అపార్ట్మెంట్లో శనివారం రాత్రి రేవ్ పార్టీ జరిగింది. పోలీసుల దాడిలో 2 కేజీల గంజాయి సహా మరిన్ని మత్తు పదార్థాలు సీజ్ అయ్యాయి. ఈ రేవ్ పార్టీలో 9 మందిని అరెస్ట్
రేవ్ పార్టీ


హైదరాబాద్, 27 జూలై (హి.స.)

హైదరాబాద్ నగరంలో మరో రేవ్ పార్టీ వెలుగు చూసింది. కొండాపూర్లో ఓ అపార్ట్మెంట్లో శనివారం రాత్రి రేవ్ పార్టీ జరిగింది. పోలీసుల దాడిలో 2 కేజీల గంజాయి సహా మరిన్ని మత్తు పదార్థాలు సీజ్ అయ్యాయి. ఈ రేవ్ పార్టీలో 9 మందిని అరెస్ట్ చేశారు.

కొండాపూర్ ఎస్వీ నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్లో ఏపీకి చెందిన కొన్ని ముఠాలు రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. వీకెండ్ సందర్భంగా ఏపీ నుంచి తీసుకువచ్చి ఇక్కడ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. రేవ్ పార్టీని శనివారం రాత్రి నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం దాడి చేశారు. అందరిని శేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande