ప్రతిపక్షం పరామర్శించేందుకు వెళ్తుంటే ఎందుకంత భయం.. హరీశ్రావు
నాగర్ కర్నూల్, 27 జూలై (హి.స.) నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో గల మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఫుట్పాయిజన్కు గురైన విద్యార్థులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులతో
హరీష్ రావు


నాగర్ కర్నూల్, 27 జూలై (హి.స.)

నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో గల మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఫుట్పాయిజన్కు గురైన విద్యార్థులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులతో మాట్లాడి ఫుడ్ పాయిజన్ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గురుకుల హాస్టల్కు వెళ్లి క్షుణ్నంగా పరిశీలించారు.

ప్రతిపక్షం పరామర్శించేందుకు వెళ్తుంటే ఎందుకంత భయమని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్రావు నిలదీశారు. ఆనాడు ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకుల విద్యార్థిని మృతదేహాన్ని నిర్బంధాల మధ్య హైదరాబాద్ నుంచి తరలించారని తెలిపారు. నేడు ఫుడ్ పాయిజన్ అయి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ గురుకుల విద్యార్థులను దొంగచాటుగా పోలీసుల బందోబస్తు మధ్య తరలిస్తున్నారని మండిపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande