కమీషన్లు వచ్చే చోటనే కాంగ్రెస్ పాలకులు పనిచేస్తున్నారు.. కేటీఆర్.
వరంగల్, 27 జూలై (హి.స.) కాంగ్రెస్ పాలకులు డబ్బులు దండుకోవడానికే పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్తో టెండర్ పేరుతో రూ.170కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. టెండర్లు పిలిచి ప్రజాధనం లూటీ చేశార
కేటీఆర్


వరంగల్, 27 జూలై (హి.స.)

కాంగ్రెస్ పాలకులు డబ్బులు దండుకోవడానికే పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్తో టెండర్ పేరుతో రూ.170కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. టెండర్లు పిలిచి ప్రజాధనం లూటీ చేశారని అన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా పరకాలలో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కేటీఆర్ కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పరకాలలో జరుగుతున్న అవినీతిపై అసెంబ్లీలో నిలదీస్తామని తెలిపారు.

కమీషన్లు వచ్చే చోటనే కాంగ్రెస్ పాలకులు పనిచేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande