టీసీఎస్‌ భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధము
హైదరాబాద్, 27 జూలై (హి.స.)ప్రముఖ టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో(2026 ఏప్రిల్‌ నుంచి) తమ ఉద్యోగుల సంఖ్యలో 2శాతం.. అంటే దాదాపు 12000 మందిని పైగా తొలగించనుంది. సాంకేతిక రంగంలో శరవేగంగా చోటుచేసుకుంటు
టీసీఎస్‌ భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధము


హైదరాబాద్, 27 జూలై (హి.స.)ప్రముఖ టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో(2026 ఏప్రిల్‌ నుంచి) తమ ఉద్యోగుల సంఖ్యలో 2శాతం.. అంటే దాదాపు 12000 మందిని పైగా తొలగించనుంది. సాంకేతిక రంగంలో శరవేగంగా చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా భవిష్యత్తు పరిణామాలకు తమ సంస్థను మరింత దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ టీసీఎస్‌ సీఈవో కె.కృతివాసన్‌ (K Krithivasan) ‘మనీకంట్రోల్‌’కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఉద్యోగాల కోత నిర్ణయం అన్ని దేశాల్లోని టీసీఎస్‌ విభాగాల్లో అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande