రెండు నెలలుగా జీతాలు ఇస్తలే.. బాసర ఐఐఐటీ గేటు వద్ద హౌస్ కీపింగ్ సిబ్బంది ఆందోళన
తెలంగాణ, నిర్మల్. 3 జూలై (హి.స.) నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటీ వద్ద ఆందోళన వాతావరణం నెలకొంది. రెండు నెలలుగా జీతాలివ్వకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు కళాశాల ప్రధాన గేటు వద్ద గురువారం ఆందోళన నిర్వహించారు. విధులు బహిష్కరించిన సుమారు 150 మంది కార్మికులు గే
బాసర ఐఐటి


తెలంగాణ, నిర్మల్. 3 జూలై (హి.స.)

నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటీ వద్ద ఆందోళన వాతావరణం నెలకొంది. రెండు నెలలుగా జీతాలివ్వకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు కళాశాల ప్రధాన గేటు వద్ద గురువారం ఆందోళన నిర్వహించారు. విధులు బహిష్కరించిన సుమారు 150 మంది కార్మికులు గేటు వద్ద బైఠాయించారు. 2 నెలల నుంచి ఫస్ట్ మ్యాన్ కంపెనీ జీతాలు ఇవ్వటం లేదని, 8 వీడీఏ లు ఇవ్వకుండా నిలిపివేశారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాల అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం మీడియా ముఖంగా చెబితే వేధింపులకు గురి చేస్తున్నారని, విధుల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని కార్మికులు వాపోయారు. తమ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో తెలియక గేటు ముందు బైఠాయించామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande