హైదరాబాద్, 3 జూలై (హి.స.)
తీవ్ర విషాదం నింపిన సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనపై నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది. ఈ పేలుడు ఘటనపై అధ్యయం చేసి నివేదిక ఇవ్వాలని నలుగురు నిపుణులతో కూడిన కమిటీని నిన్న ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిదే. ఈ మేరకు ఇవాళ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, సభ్యులు ప్రతాప్, సూర్యనారాయణ, సంతోష్ పేలుడు సంభవించిన పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. అక్కడ తాజా పరిస్థితులను పరిశీలించారు. అయితే సిగాచి పరిశ్రమలో ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు విశ్లేషించడంతో పాటు కార్మికుల భద్రతకు నిబంధనలు పాటించారా? లేదా అనే విషయాలపై తీయనున్నది.ఈ పేలుడుకు గల కారణాలు ఏంటి, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..