అమ్మబాబోయ్.! చింత చిగురు రేటు ఏంటి ఇంతలా పెరిగింది.. కేజీ ఎంతో తెల్సా
అమరావతి, 3 జూలై (హి.స.)మే, జూన్ నెలలలోనే దొరికే చింత చిగురు.. జూలైలోనూ అందుబాటులో ఉండటంతో చింత చిగురుకు డిమాండ్ పెరిగింది. పుల్ల.. పుల్లగా.. ఉండే చింతాకు ఎవరు తినాలనుకోరు. నోటికి కమ్మగా, హెల్దీగా ఉండే చింతాకు సీజనల్‌గానే దొరకడంతో దానికున్న డిమాండ్ అం
అమ్మబాబోయ్.! చింత చిగురు రేటు ఏంటి ఇంతలా పెరిగింది.. కేజీ ఎంతో తెల్సా


అమరావతి, 3 జూలై (హి.స.)మే, జూన్ నెలలలోనే దొరికే చింత చిగురు.. జూలైలోనూ అందుబాటులో ఉండటంతో చింత చిగురుకు డిమాండ్ పెరిగింది. పుల్ల.. పుల్లగా.. ఉండే చింతాకు ఎవరు తినాలనుకోరు. నోటికి కమ్మగా, హెల్దీగా ఉండే చింతాకు సీజనల్‌గానే దొరకడంతో దానికున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడైతే కేజీ రూ. 500 నుంచి రూ. 700 పలుకుతున్నా.. చింత చిగురును కొనేందుకు కూడా కొనుగోలుదారులు వెనకాడటం లేదు. విటమిన్లు ఎక్కువగా వుంటాయని, ఎరువుల మందులు వాడని చింతాకు తినేందుకు ఇష్టపడుతున్నారు పబ్లిక్. ముఖ్యంగా మటన్, చికెన్, ఫిష్ అన్ని నాన్ వెజ్ వంటల్లో చింతాకు వేస్తే ఆ టేస్ట్ వేరబ్బా అంటూ తింటున్నారు చింత చిగురు ప్రియులు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోనే ఐదు గంటల్లో యాభై నుంచి అరవై కేజీల చింత చిగురు అమ్ముడుపోతుంది. మారుతున్న కాలంతో పాటు చింతాకు రేటు మారిందంటున్నా.. కొనేవాళ్ల సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande