తిరుపతిలోని.గోవిందరాజు.ఆలయం వద్ద భారీ అగ్ని.ప్రమాదం
తిరుపతి, 3 జూలై (హి.స.) : తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు దుకాణాలు దగ్ధం కాగా, ఆలయం ముందు ఉన్న చలువ పందిళ్లకు నిప్పంటుకుంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మూడు అగ్నిమాపక
తిరుపతిలోని.గోవిందరాజు.ఆలయం వద్ద భారీ అగ్ని.ప్రమాదం


తిరుపతి, 3 జూలై (హి.స.)

: తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు దుకాణాలు దగ్ధం కాగా, ఆలయం ముందు ఉన్న చలువ పందిళ్లకు నిప్పంటుకుంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు. ఓ దుకాణంలో విద్యుదాఘాతం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్టు అధికారులు గుర్తించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande