అమరావతి, 3 జూలై (హి.స.)తెలుగు రాష్ట్రాల్లో మబ్బులు కమ్మేశాయి. అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే ద్రోణి ఆగ్నేయ రాజస్థాన్ నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు మధ్య మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాలు గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ ఉన్న ఉపరితల ఆవర్తనం.. సగటున సముద్ర మట్టానికి 0.9 కి.మీ 5.8 కి.మీ మధ్య విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం వైపుకు వంగి ఉంటుందని తెలిపిన వాతావరణ శాఖ.
దీని ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు(గురువారం) ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలకు.. తెలంగాణకు రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురవనున్నాయి. గంటకు 30-40 కి.మీ.వేగంతో ఈదురు గాలులు వీస్తాయి.
ఇదిలా ఉంటే.. ఏపీలోని పలు జిల్లాలకు వర్షసూచన చేసింది అమరావతి వాతావరణ కేంద్రం.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి,విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఈ రోజు తెలంగాణలోని అన్ని జిల్లాలలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది.. తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి