రుద్రప్రయాగ్: 3 జూలై (హి.స.)
కేదార్నాథ్ యాత్రను గురువారం అనగా ఇవాళ తాత్కాలికంగా నిలిపివేశారు. సోన్రయాగ్ మార్గంలో ఉన్న మున్కతియా వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కేదారీశ్వరుడి దర్శనాన్ని ఆపేశారు. కొండచరియలకు శిథిలాలన్నీ ఆ మార్గంలో ఉన్న రోడ్డును పూర్తిగా బ్లాక్ చేశాయి. మున్కతియా స్లైడింగ్ జోన్ పూర్తిగా రాళ్లతో నిండిపోయింది. దీంతో అధికారులు కేదార్ యాత్రను బంద్ చేశారు. గౌరీకుండ్ నుంచి వస్తున్న కొంతమంది యాత్రికులు ఆ కొండచరియల్లో చిక్కుకున్నారు. వాళ్లను ఎన్డీఆర్ఎఫ్ దళానికి చెందిన సిబ్బంది రక్షించింది. సురక్షితంగా సోన్రయాగ్కు తీసుకువచ్చారు. ముందు జాగ్రత్తగా కేదార్నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..