కర్నూలు, 3 జూలై (హి.స.)
ఏపీలో విమాన సర్వీసులు ప్రయాణికులకు వేగంగా అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కర్నూల్ టు విజయవాడ విమాన సర్వీసులను వర్చువల్‌గా ప్రారంభించారు కేంద్ర విమానాయానశాఖమంత్రి రామ్మోహన్‌నాయుడు. ఇప్పటికే కర్నూలు నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కర్నూల్ నుంచి విజయవాడకు కూడా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇక్కడి నుంచి ఇండిగో విమాన సర్వీసులను కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు. ఓర్వకల్ ఎయిర్ పోర్టును మరింత విస్తరిస్తామన్నారు కేంద్రమంత్రి. ప్రతి ఎయిర్ పోర్ట్ లో అదనపు విమానాలు ప్రారంభించుకున్నామని తెలిపారు.
కర్నూలు ఎయిర్ పోర్ట్ అభివృద్హికి సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు రామ్మోహన్‌నాయుడు. కర్నూలు ఎయిర్ పోర్ట్ కి కనెక్టివిటీ పెంచుతామన్నారు. వారంలో 3 రోజులు విజయవాడ-కర్నూలు విమాన సర్వీసులు నడుస్తాయని, రాబోయే రోజుల్లో 7 రోజూలు నడిపిస్తామన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు. కర్నూలులో పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కర్నూలులో డ్రోన్ హబ్ రాబోతుందని తెలిపారు. అభివృద్ధిలో లాజిస్టిక్స్, కన్నెక్టీవిటీ ముఖ్యం అన్నారు కేంద్రమంత్రి. ఏపీలోని ప్రతి విమానాశ్రయం నుంచి అదనపు సర్వీసులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి