సమస్యలపై వెంటనే స్పందించండి.. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు..
తెలంగాణ,భద్రాద్రి కొత్తగూడెం, 3 జూలై (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లో గండుగులపల్లిలో గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన నివాసంలో అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ని
మంత్రి తుమ్మల


తెలంగాణ,భద్రాద్రి కొత్తగూడెం, 3 జూలై (హి.స.)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట

మండలం లో గండుగులపల్లిలో గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన నివాసంలో అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గంలోని సమస్యలు ఎవరికైనా ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారులు స్పందనలో జాప్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి చిన్న సమస్యకైనా వెంటనే పరిష్కారం చూపించే విధంగా వ్యవహరించాలని, గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. అభివృద్ధి లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని తుమ్మల స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande