తెలంగాణ, వరంగల్. 3 జూలై (హి.స.) మొక్కలను విరివిగా నాటాలని
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా దామెర మండలం ఓగులాపూర్ గ్రామంలోని దర్గాలో గురువారం ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలోఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. అంతకుముందు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు.
భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలన్నారు. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు విరివిరిగా మొక్కలను పెంచాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు