పాశమైలారం ఘటన.. నాలుగు రోజులైన కనిపించని కార్మికుల జాడ
హైదరాబాద్, 3 జూలై (హి.స.) పటాన్ చెరు సమీపంలో ఉన్న పాశమైలారం ఇండస్ట్రీయల్ ప్రాంతంలో సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలి.. 45 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ విషాద సంఘటన రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద ఇండస్ట్రియల్ ప్రమాదంగా నిలిచింది. అయితే ఈ ప్రమాదంలో మొ
పాషా మైలారం ఘటన


హైదరాబాద్, 3 జూలై (హి.స.) పటాన్ చెరు సమీపంలో ఉన్న పాశమైలారం ఇండస్ట్రీయల్ ప్రాంతంలో సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలి.. 45 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ విషాద సంఘటన రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద ఇండస్ట్రియల్ ప్రమాదంగా నిలిచింది. అయితే ఈ ప్రమాదంలో మొత్తం 20 మంది శిథిలాల కింద చిక్కుకోవడంతో రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. 8 మంది మృతదేహాను వెలికితీసింది. ఈ ఘటన చోటు చేసుకొని నాలుగు రోజులు అవుతున్నా.. నేటికి మరో 12 మంది ఆచూకీ లభించడం లేదు. ఇదిలా ఉంటే వెలికి తీసిన మృతదేహాలు దారుణంగా కాలిపోవడంతో పాటు, భారీ శిథిలాలు మీద పడటంతో.. కార్మికులు మాంసం ముద్దల్లా మారిపోయారు.

దీంతో మృతదేహాలను గుర్తించేందుకు వైద్యులు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు రోజు అవుతున్నప్పటికి తమ వారి జాడ దొరక్కపోవడంతో.. కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధ్రువ ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 18 మంది కార్మికుల మృతదేహాలు గుర్తించిన అధికారులు వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పి స్వస్థలాలకు తరలించారు. అలాగే మరికొంత మంది కోసం రెస్క్యూ కొనసాగుతుండగా.. డీఎన్ఏ రిపోర్టులు వచ్చాక మిగతా మృతదేహాలను కుటుంబ అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande