వన దేవతలను దర్శించుకున్న ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్
తెలంగాణ, ములుగు. 3 జూలై (హి.స.) ములుగు జిల్లాలోని వన దేవతలు మేడారం సమ్మక్క, సారలమ్మలను గురువారం రెవెన్యూ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ దర్శించుకున్నారు. అమ్మవార్ల దర్శనానికి వచ్చిన వారికి కలెక్టర్ దివాకరతో పాటు పూజారులు, దేవదాయ
మేడారం


తెలంగాణ, ములుగు. 3 జూలై (హి.స.) ములుగు జిల్లాలోని

వన దేవతలు మేడారం సమ్మక్క,

సారలమ్మలను గురువారం రెవెన్యూ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ దర్శించుకున్నారు. అమ్మవార్ల దర్శనానికి వచ్చిన వారికి కలెక్టర్ దివాకరతో పాటు పూజారులు, దేవదాయ శాఖ ఈవో వీరస్వామిలు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా అమ్మవార్లకు గిరిజన సంప్రదాయ పద్ధతులను ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారంలోని ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో 2026 జనవరి 28 నుంచి జరిగే అమ్మవార్ల మహా జాతరలో భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన సౌకర్యాలు పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అడ్వైజర్ గోవింద హరి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande