తెలంగాణ, వేములవాడ. 3 జూలై (హి.స.)
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రాజరాజేశ్వర వేద ఆగమ సంస్కృత విద్యాలయ ట్రస్ట్ వారి చతుర్వేద స్మార్త పరీక్షలు నిర్వహించడం గర్వంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తుని పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి ఆధ్వర్యంలో పార్వతీ రాజరాజేశ్వర అఖిల భారత వేద శాస్త్ర స్మార్త ఆగమ విద్వత్ సదస్సు వేములవాడ లో ఏర్పాటు చేశారు. విద్వత్ సదస్సులో భాగంగా వేద పండితులకు చతుర్వేద స్మార్త పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్త వేద పండిత విద్యార్థులు హాజరయ్యే పరీక్షలు వేములవాడలో జరపడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ప్రభుత్వ విప్ అన్నారు. నాలుగు వేదాలు చదివే పాఠశాల ఒక్క వేములవాడలోనే ఉందని, వేద పండితులకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలు రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో నిర్వహించడం అభినందనీయమన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు