కుప్పం, 3 జూలై (హి.స.) తప్పుడు ప్రచారాలు తాత్కాలికమేనని, ప్రజలను ఎక్కువ కాలం మభ్య పెట్టలేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మనం చేసిన పనులే శాశ్వతంగా ఉంటాయని చెప్పారు. ఈ మేరకు కుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మరణంపై మాజీ ముఖ్యమంత్రి తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేయడం తనకు అలవాటు లేదని ఆయన అన్నారు. సింగయ్య మరణంపై అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కారు కింద పడిన వ్యక్తిని ఎవరైనా వెంటనే ఆసుపత్రికి తరలిస్తారని, వైసీపీ నేతలకు ఈ కనీస స్పృహ కూడా లేదని ఆయన మండిపడ్డారు. మానవత్వం లేకుండా బాధితుడిని కంప చెట్లలో పడేసి వెళ్లారని విమర్శించారు. ఈ ఘటనపై రాజకీయం చేయాలని చూస్తున్నారని, బాధితుడు సింగయ్య భార్యను బెదిరించారని చంద్రబాబు ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి