అంగన్వాడి హెల్పర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.
హైదరాబాద్, 3 జూలై (హి.స.) అంగన్ వాడీ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అంగన్ వాడీ టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ
అంగన్వాడి


హైదరాబాద్, 3 జూలై (హి.స.)

అంగన్ వాడీ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అంగన్ వాడీ టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంబంధిత ఫైల్పై గురువారం సంతకం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల సుమారు 4,322 మంది అంగన్ వాడీ హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశం ఏర్పడనుంది. గతంలో 45 ఏళ్లు దాటిన తర్వాత ప్రమోషన్ కోసం అవకాశాలు లేకపోయినా, ఇప్పుడు వారికీ మళ్ళీ అవకాశం లభించనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande