అమరావతి, 3 జూలై (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu.).. ఎస్వీ రంగారావు జయంతి (SV Ranga Rao's birth anniversary) సందర్భంగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
సీఎం తన ట్వీట్‌లో మూడు దశాబ్దాలపాటు వెండితెరపై విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనతో సినీ ప్రేక్షకుల హృదయాలలో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్న యశస్వి.. మహానటుడు ఎస్వీ రంగారావు జయంతి సందర్భంగా.. ఆ విశ్వనట చక్రవర్తి కళాసేవను స్మరించుకుందాం అని రాసుకొచ్చారు.
ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. ఆయన తన నటతో విశ్వనట చక్రవర్తి, నటసామ్రాట్ బిరుదులతో సుప్రసిద్ధుడైన భారతీయ సినీ నటుడిగా పేరుగాంచారు. ఆయన దక్షిణ భారత సినిమాలో తొలి స్టార్ క్యారెక్టర్ నటుడిగా పరిగణించబడ్డారు. మూడు దశాబ్దాలకు పైగా విస్తరించిన తన కెరీర్‌లో, రంగారావు విభిన్నమైన సామాజిక, జీవితచరిత్ర, పౌరాణిక పాత్రలలో మెరిసిన మెథడ్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు. ఆయన 1918 జూలై 3, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నూజివీడులో తెలగ నాయుళ్ళ వంశంలో లక్ష్మీ నరసయమ్మ, కోటీశ్వర నాయుడు దంపతులకు జన్మించారు. ఆయన ఎన్నో సినిమాల్లో నటించిన తర్వాత.. 1974 జూలై 18న చివరి శ్వాస విడిచారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి