కర్నూలు, 3 జూలై (హి.స.)రాష్ట్రంలో రోడ్డు ప్రమాద ఘటన వెలుగుచూసింది. ఏపీ (Andhra Pradesh)లోని పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కనమర్లపూడి వద్ద కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి మార్గంలో ఇవాళ(గురువారం) రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం(Road Accident)లో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. నరసరావుపేట నుంచి కర్నూలు వైపు వెళుతున్న లారీని రాయచూరు నుంచి కాశీ యాత్రకు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రైవేటు బస్సులోని పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఎ. ధనలక్ష్మి, సాయి సంపత్ కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే వారిని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ రోడ్డు ప్రమాదం జాతీయ రహదారి మార్గంలో చోటుచేసుకోవడంతో అరగంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి