శ్రీశైలం జలశయానికి కొనసాగుతోన్న వరద
శ్రీశైలం , 3 జూలై (హి.స.)గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (హెవీ Rains) కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, జలాశయాలు పొంగిపోర్లుతున్నాయి. ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల కారణగా శ్రీశైలం రిజర్వాయర్‌కు (Srisailam
శ్రీశైలం జలశయానికి కొనసాగుతోన్న వరద


శ్రీశైలం , 3 జూలై (హి.స.)గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (హెవీ Rains) కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, జలాశయాలు పొంగిపోర్లుతున్నాయి. ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల కారణగా శ్రీశైలం రిజర్వాయర్‌కు (Srisailam Reservoir) వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 63,150 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలో వచ్చి చేరుతుండగా.. శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ఈ డ్యామ్‌లో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 875.60 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 166.31 టీఎంసీలుగా ఉంది. దీంతో అధికారులు శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 27,830 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి (Electricity generation) ద్వారా నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande