సీఎం నివాసం సమీపంలో యోగాసనాలతో నిరసన
అమరావతి, 3 జూలై (హి.స.)రాజధాని అమరావతిలోని కరకట్ట సమీపంలో, ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఇవాళ(గురువారం) ఉదయం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆయన నివాసం ముందు యోగ టీచర్లు ఆందోళనకు దిగారు. సీఎం చంద్రబాబు తనయుడు, విద్యా శాఖ మంత్రి అయిన నారా లోకే
సీఎం నివాసం సమీపంలో యోగాసనాలతో నిరసన


అమరావతి, 3 జూలై (హి.స.)రాజధాని అమరావతిలోని కరకట్ట సమీపంలో, ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఇవాళ(గురువారం) ఉదయం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆయన నివాసం ముందు యోగ టీచర్లు ఆందోళనకు దిగారు. సీఎం చంద్రబాబు తనయుడు, విద్యా శాఖ మంత్రి అయిన నారా లోకేష్ తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో యోగాసనాలతో తమ నిరసనలు తెలియజేశారు. తమను యోగా టీచర్లుగా శాశ్వతంగా నియమించాలని వీరు డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande