‘ఆ భూముల జోలికొస్తే ఊరుకోం’.. వైఎస్ షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్
అమరావతి, 3 జూలై (హి.స.)ఏపీలోని కూటమి ప్రభుత్వం పై ఏపీ పీసీసీ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కరేడు రైతులది బతుకు పోరాటం. ఊరిని చంపి పరిశ్రమ పెడతాం అంటే చూస్తూ ఊరుకునేది లేదని వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు. కరేడు భూములు జోలికొస్తే రైతుల పక్షాన ఉద్
‘ఆ భూముల జోలికొస్తే ఊరుకోం’.. వైఎస్ షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్


అమరావతి, 3 జూలై (హి.స.)ఏపీలోని కూటమి ప్రభుత్వం పై ఏపీ పీసీసీ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కరేడు రైతులది బతుకు పోరాటం. ఊరిని చంపి పరిశ్రమ పెడతాం అంటే చూస్తూ ఊరుకునేది లేదని వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు. కరేడు భూములు జోలికొస్తే రైతుల పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సోలార్ ప్లాంట్‌కి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా కరేడు గ్రామ రైతులు చేస్తున్న ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. పచ్చటి పొలాల్లో ప్రజా అభిప్రాయం సేకరించకుండా భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం దుర్మార్గం. ఇది కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనం అన్నారు. ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండోసోల్ సోలార్ కంపెనీకి 8458 ఎకరాలు దారాదత్తం చేస్తామనడం పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande