తిరుపతి, 3 జూలై (హి.స.)బాలికల బీసీ వసతి గృహంలో మార్నింగ్ టిఫిన్ చేసిన విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల, శ్రీకాళహస్తిలోని బీసీ బాలుర హాస్టల్ లో ఉదయం అల్పాహారం తీసుకున్న 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగు చూసింది. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి పట్టణంలోని బాలికల బీసీ వసతి గృహంలో ఉదయం టిఫిన్ ఉప్మా తిని విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉప్మాలో జెర్రీ కనిపించడంతో మిగిలిన విద్యార్థినులను అప్రమత్తం చేశారు. దీంతో పెను ముప్పు తప్పింది. టిఫిన్ తిన్న ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో.. వెంటనే శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి