పద్మ అవార్డులకు నామినేషన్ గడువు పెంపు
ఢిల్లీ, 31 జూలై (హి.స.) భారత విశిష్ట పురస్కారాలైన పద్మ అవార్డులకు(Padma Awarads) నామినేషన్స్ కు కేంద్ర ప్రభుత్వం గడువును పొడిగించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2026 పద్మ అవార్డుల కోసం నామినేషన్/సిఫార్సుల గడువును జులై 31 నుంచి ఆగస్టు 15 వరకు పొడిగ
పద్మ అవార్డులకు నామినేషన్ గడువు పెంపు


ఢిల్లీ, 31 జూలై (హి.స.)

భారత విశిష్ట పురస్కారాలైన పద్మ అవార్డులకు(Padma Awarads) నామినేషన్స్ కు కేంద్ర ప్రభుత్వం గడువును పొడిగించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2026 పద్మ అవార్డుల కోసం నామినేషన్/సిఫార్సుల గడువును జులై 31 నుంచి ఆగస్టు 15 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ నామినేషన్‌లు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ https://awards.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించబడతాయని తెలిపింది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ వంటి పద్మ అవార్డులు భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటిగా పరిగణించబడతాయి.

1954లో స్థాపించబడిన ఈ అవార్డులు, ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కళ, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, విజ్ఞానం, ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వాణిజ్యం మరియు పరిశ్రమ వంటి వివిధ రంగాలలో చేసిన విశిష్ట సేవలు అసాధారణ విజయాలు సాధించిన వ్యక్తులకు ఇవ్వబడతాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande