హైదరాబాద్, 5 జూలై (హి.స.)
బీజేపీ విధానాలు, నిర్ణయాలు నచ్చక ఎవరు పార్టీని వీడినా నష్టం లేదని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు . నమ్ముకున్నవారిని బీజేపీ ఎప్పుడూ మోసం చేయదని, అందుకు తానే ఉదాహరణ అని చెప్పారు. పార్టీ అభివృద్ధికి పని చేసిన వారందరికీ అవకాశాలు వస్తాయన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ విధానాలు నచ్చనివారు పార్టీని వీడినా నష్టం లేదంటూ వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..