తెలంగాణ, కరీంనగర్. 5 జూలై (హి.స.)
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కరీంనగర్ లోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పంజాల శ్రీనివాస్ తో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశీయ బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు తీసుకొని వాటిని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టి విదేశాలలో జల్సాలు చేస్తున్న విజయ్ మాల్యా, నీరజ్ మోదీలను దేశానికి రప్పించడంలో ప్రధాని విఫలమయ్యారన్నారు. శత్రుదేశం పాకిస్తాన్తో చర్చలు జరిపిన కేంద్ర ప్రభుత్వం.. మావోయిస్టులతో ఎందుకు చర్చలు జడపడం లేదో సమాధానం చెప్పాలన్నారు. విలువైన అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి ప్రధాని మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు