నా మాటలను వక్రీకరిస్తే సహించేది లేదు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వార్నింగ్
తెలంగాణ, జడ్చర్ల. 5 జూలై (హి.స.) బనకచర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు కోవర్ట్ లు తెలంగాణలో ఉన్నారని తాను చేసిన వాఖ్యలు కేవలం కాంట్రాక్టర్లను ఉద్దేశించి మాత్రమేనని, నాయకులను గురించి కాదని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశా
ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి


తెలంగాణ, జడ్చర్ల. 5 జూలై (హి.స.)

బనకచర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు కోవర్ట్ లు తెలంగాణలో ఉన్నారని తాను చేసిన వాఖ్యలు కేవలం కాంట్రాక్టర్లను ఉద్దేశించి మాత్రమేనని, నాయకులను గురించి కాదని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు సంబంధించిన వీడియోను చూడకుండానే కొందరు విపక్ష నేతలు తాను నాయకులను ఉద్దేశించి కోవర్టులంటూ మాట్లాడానని తప్పుడు ప్రచారం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తులు కాంట్రాక్టర్లుగా పని చేస్తున్నారని, వారు ఇరిగేషన్ ప్రాజెక్టులు, పెద్ద రోడ్డు కాంట్రాక్టర్లు, హైదరాబాదులో దండాలు చేస్తున్నారని వారిని టైట్ చేస్తే వారే వెళ్లి చంద్రబాబునాయుడి కాళ్లు పట్టుకొని బనకచర్ల ప్రాజెక్టు ఆపుతారని మాత్రమే తాను చెప్పానని, అంతేకానీ తాను ఏనాయకుడి గురించి మాట్లాడలేదని మీడియాకు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అనిరుధ్ రెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande