ప్రభుత్వ పథకాల్లో జర్నలిస్టుల భాగస్వామ్యం : మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ, పెద్దపల్లి. 5 జూలై (హి.స.) ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల ను ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములను చేస్తామని, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పరంగా తనవంతుగా కృషి చేస్తానని
మంత్రి శ్రీధర్ బాబు


తెలంగాణ, పెద్దపల్లి. 5 జూలై (హి.స.)

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల ను ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములను చేస్తామని, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పరంగా తనవంతుగా కృషి చేస్తానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. శనివారం పెద్దపల్లి జిల్లా మంథని ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గడిచిన పదేళ్లలో జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో జర్నలిస్టులు అందరికీ భాగస్వామ్యం కల్పిస్తామన్నారు. రాజకీయాలకతీతంగా పాత్రికేయులు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande