ఆర్టీసీని బతికించిన మహాలక్ష్మి పథకం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 5 జూలై (హి.స.) తెలంగాణ ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ప్రజా భవన్లో ఆర్టీసీలో 151 మండల మహిళా సంఘాల గ్రూప్లకు (అద్దె బస్సుల యజమానులకు) రూ.1.05 కోట్ల చెక్కును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కతో కల
మంత్రి పొన్నం


హైదరాబాద్, 5 జూలై (హి.స.) తెలంగాణ ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ప్రజా భవన్లో ఆర్టీసీలో 151 మండల మహిళా సంఘాల గ్రూప్లకు (అద్దె బస్సుల యజమానులకు) రూ.1.05 కోట్ల చెక్కును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కతో కలిసి పొన్నం ప్రభాకర్ అందజేశారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో మహిళలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. చేతి గుర్తుకు ఓటేసినందుకు చెయ్యెత్తితే చాలు బస్సు ఆపుతున్నారు.. తాము సగౌరవంగా బస్సెక్కుతున్నామని మహిళలు చెబుతున్నారని గుర్తుచేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande