‘పవన్‌ కల్యాణ్‌ చిక్కడు.. దొరకడు’.. మాజీ మంత్రి సెన్సేషనల్ కామెంట్స్
అమరావతి, 5 జూలై (హి.స.): ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) పై మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎర్ర బుక్కు పేరుతో వెర్రి పాలన జరుగుతోందని వైసీపీ నేత పేర్ని నాని(Former Minister Perni Nani)
‘పవన్‌ కల్యాణ్‌ చిక్కడు.. దొరకడు’.. మాజీ మంత్రి సెన్సేషనల్ కామెంట్స్


అమరావతి, 5 జూలై (హి.స.): ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) పై మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎర్ర బుక్కు పేరుతో వెర్రి పాలన జరుగుతోందని వైసీపీ నేత పేర్ని నాని(Former Minister Perni Nani) విమర్శించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు(TDP Leaders) మల్లేశ్వరరావు పై హత్యయత్నం చేశారని ఆయన ఆరోపించారు. దుర్మార్గం అక్రమాలను అడ్డుకుంటున్నారనే హత్యాయత్నం చేశారని పేర్ని నాని అన్నారు. రాష్ట్రంలో ఏడాదిగా ప్రతిరోజూ రాజకీయ దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పోస్టర్లను తప్పుపట్టే వారికి దాడులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సినిమా డైలాగుల గురించి పవన్ కళ్యాణ్(Deputy CM pawan kalyan) చెప్పేవాన్ని అబద్ధాలే అని దుయ్యబట్టారు. ఈ క్రమంలో షూటింగ్‌లో ఉండే పవన్‌ కల్యాణ్‌ చిక్కడు.. దొరకడని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పవన్‌ కళ్యాణ్(Pawan Kalyan) స్పీచ్‌లన్నీ సినిమా డైలాగులే అని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్‌(Former CM YS Jagan)ను అధికారంలోకి రానివ్వనని అనడానికి పవన్‌ కళ్యాణ్ ఎవరు? అని పేర్ని నాని నిలదీశారు. 2019లో కూడా వైఎస్ జగన్‌ను అధికారంలోకి రానివ్వను అని పవన్‌ కళ్యాణ్ అనలేదా అని ప్రశ్నించారు. అసలు తన శాఖలో ఏం జరుగుతోందో పవన్‌ కళ్యాణ్‌కు తెలుసా? అని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande