హైదరాబాద్, 5 జూలై (హి.స.)
గురు పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్సుఖ్ నగర్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. జూలై 9 న రాత్రి 7 గంటలకు దిల్సుఖ్ నగర్ నుంచి బస్సు బయల్దేరుతుందని హైదరాబాద్-2 డిపో మేనేజర్ తెలిపారు. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటుందని, తిరిగి జూన్ 11న మధ్యాహ్నం అరుణాచలంలో బయలుదేరి 12వ తేదీన ఉదయం 6 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని వెల్లడించారు. ఒక్కరికి టికెట్ చార్జీ రూ.3900 గా నిర్ణయించామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్