అమరావతి, 5 జూలై (హి.స.)
సుండుపల్లి: అన్నమయ్య జిల్లా శేషాచలం అడవుల్లో పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ఎదురుదాడికి దిగారు. సుండుపల్లి మండలం కావలి వద్ద ఉన్న డంపింగ్ కేంద్రం నుంచి ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్మగ్లర్లు ఎదురుదాడి చేసి పరారయ్యారు. వారిలో తమిళనాడుకు చెందిన గోవిందన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.80 లక్షల విలువైన 26 దుంగలు.. 2 కత్తులు, 2 గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. పరారైన మరో 10 మంది ఎర్రచందనం కూలీల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అదనపు ఎస్పీ వెంకటాద్రి వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ