తెలంగాణ, ఆదిలాబాద్ 5 జూలై (హి.స.) ఆదిలాబాద్ జిల్లాలో దురదృష్టకరమైన సంఘటన చోటుచేసుకుంది. సైకిల్ పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారులు(అక్క తమ్ముడు) మృతిచెందారు. మావల గ్రామానికి చెందిన వినూత్న (11), తమ్ముడు విదాత్ (8) గ్రీన్ వ్యాలీ కాలనీలో సైకిల్ మీద వెళ్తుండగా శనివారం ఈ దుర్ఘటన జరిగింది. ఆకస్మికంగా నీటి గుంటలో పడిపోయిన వారిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు. చిన్నారుల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు