తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం.
5 జూలై (హి.స.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో నిన్న మొన్నటి వరకు నీరు లేక వెల వెలబోయిన తాలిపేరు ప్రాజెక్టు ప్రస్తుతం జలకళను సంతరించుకుంది. చర్ల మండలం తో పాటు సరిహద్దు ఛత్తీస్గడ్లో కురుస్తున్న వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టు లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గత మూడు రోజులుగా ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. తాలిపేరు ప్రాజెక్టు 74 మీటర్లు పూర్తి నీటి సామర్థ్యం కాగా శనివారం కి 71.72 మీటర్లకు నీరు చేరుకుంది. మరో రెండు రోజులు వర్షాలు కురిస్తే తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారనుంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పూర్తి ఆయకట్టు 24,700 ఎకరాలు కాగా చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల పొలాలకు సాగునీరు అందే అవకాశం ఉంది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు