భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్న షాద్నగర్ ఎక్సైజ్ పోలీసులు
రంగారెడ్డి, 5 జూలై (హి.స.) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ పారిశ్రామిక వాడలో ఎక్సైజ్ పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. షాద్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎక్సైజ్ డీపీఓ ఉజ్వల మాట్లాడుతూ
షాద్నగర్ ఎక్సైజ్


రంగారెడ్డి, 5 జూలై (హి.స.)

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్

నియోజకవర్గం నందిగామ పారిశ్రామిక వాడలో ఎక్సైజ్ పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. షాద్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎక్సైజ్ డీపీఓ ఉజ్వల మాట్లాడుతూ.... నందిగామ పారిశ్రామికవాడలో ఒక చిన్న హోటల్ లో రెండున్నర కిలోల గంజాయి తో పాటు, 9 కిలోల గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం వచ్చినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న షాద్ నగర్ ఎక్సైజ్ సీఐ శేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా గంజాయి అమ్ముతున్న పింటూ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో, కళాశాలల్లో గంజాయి సేవిస్తే కలిగే అనర్ధాలపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande