రాష్ట్రంలో రేషన్ కార్డుల రూపుమారుతోంది
అమరావతి, 5 జూలై (హి.స.) :రాష్ట్రంలో రేషన్‌ కార్డుల రూపుమారుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం కార్డులకు పార్టీ రంగులు పులిమేసి.. వాటిపై ఒకవైపు జగన్‌ బొమ్మ, మరోవైపు వైఎస్‌ రాజశేఖరరెడ్డి()బొమ్మను ముద్రించి పంపిణీ చ
రాష్ట్రంలో రేషన్ కార్డుల రూపుమారుతోంది


అమరావతి, 5 జూలై (హి.స.)

:రాష్ట్రంలో రేషన్‌ కార్డుల రూపుమారుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం కార్డులకు పార్టీ రంగులు పులిమేసి.. వాటిపై ఒకవైపు జగన్‌ బొమ్మ, మరోవైపు వైఎస్‌ రాజశేఖరరెడ్డి()బొమ్మను ముద్రించి పంపిణీ చేసింది. ఇప్పుడు వాటికి స్వస్తి చెప్పి.. రాజకీయ పార్టీల రంగులు లేకుండా, నేతల బొమ్మలు ముద్రించకుండా కొత్త కార్డులను రూపొందిస్తున్నారు. పాత వాటి స్థానంలో ఈ కొత్త కార్డులు జారీ చేయడంతో పాటు ఇకపై కొత్తగా మంజూరు చేసే కార్డులన్నీ కూడా స్మార్ట్‌ కార్డులుగానే ఉండనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande