ఈ నెల 7న తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్, 5 జూలై (హి.స.) తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TGICET 2025) ఫలితాలను జులై 7న విడుదల చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఐసెట్ కన్వీనర్, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ రిజ
ఐసెట్ ఫలితాలు


హైదరాబాద్, 5 జూలై (హి.స.)

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ

కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TGICET 2025) ఫలితాలను జులై 7న విడుదల చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఐసెట్ కన్వీనర్, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య రవి ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలికి తెలియజేశారు. జులై 7న మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అధికారికంగా ఫలితాలను ప్రకటించనున్నారు.

TGICET 2025 పరీక్షలు జూన్ 8, 9 తేదీలలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించబడ్డాయి.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande