తిరుమలలో అన్న ప్రసాదం తయారీ.. ఆ వీడియో రిలీజ్ చేసిన టీటీడీ!
తిరుమల, 5 జూలై (హి.స.)పవిత్ర పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో తిరుమల కొండపై కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసి
తిరుమలలో అన్న ప్రసాదం తయారీ.. ఆ వీడియో రిలీజ్ చేసిన టీటీడీ!


తిరుమల, 5 జూలై (హి.స.)పవిత్ర పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో తిరుమల కొండపై కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ తరుణంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల(Tirumala) కొండకు చేరుకుని.. శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే.. తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శనానికి గంటల తరబడి క్యూలైన్‌లో వేచి చూస్తారు.

ఈ తరుణంలో తిరుమల(Tirumala) క్యూలైన్లలో ఉండే భక్తులకు(Devotees) టీటీడీ దేవస్థానం అన్నప్రసాదం, మజ్జిగ, పాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో రుచికరమైన తిరుమల ప్రసాదం ఎలా తయారు చేస్తారో చూపే ఓ వీడియోను టీటీడీ తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ వీడియోలో ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేస్తారు? అక్కడ ఎంత పరిశుభ్రంగా ఉంటుందో చూపుతుంది. మీరు స్వామి వారిని దర్శించే ముందు భక్తులకు ప్రేమతో, సంప్రదాయంగా అందించే అన్నపూర్ణ దివ్య సేవను అస్వాదించండి అని టీటీడీ(TTD) ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చింది. ఈ వీడియోను మంత్రి లోకేష్(Minister Nara Lokesh) కూడా షేర్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande