హైదరాబాద్, 7 జూలై (హి.స.)
రాష్ట్రంలో కొందరు పోలీసుల పేరు చెప్పి స్వర్ణకారులను వేధింపులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఈ మేరకు కవిత నేడు వీడియో విడుదల చేశారు… ఇటీవల కాలంలో వరుసగా జరుగుతోన్న స్వర్ణకారుల ఆత్మహత్యలు కలిచి వేస్తున్నాయన్నారు. విశ్వకర్మ వృత్తుల వారు యావత్ దేశానికే ఊపిరి పోస్తున్నవారికి కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో ఆయా వృత్తులకు ఆదరణ తగ్గిపోయిందన్నారు. .. క్రమేణ వృత్తి పని చేస్తున్న వారికి ఉపాధి లేకుండా పోతుందని వారి జీవనం నడవడమే ఇబ్బందికరంగా మారిందని వివరించారు. ఇటీవల కాలంలో దొంగ బంగారం కొన్నారని పోలీసులు స్వర్ణకారులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.. ఆ బంగారం అమ్మిన దొంగలను మాత్రం పట్టుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక కొందరు స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు..
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్