ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు .శ్రీశైలం.పర్యటన
అమరావతి, 7 జూలై (హి.స.): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీశైలంలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీరు విడుదల చేయనున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో శ్రీశైలం ప్రా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు .శ్రీశైలం.పర్యటన


అమరావతి, 7 జూలై (హి.స.): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీశైలంలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీరు విడుదల చేయనున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో శ్రీశైలం ప్రాజెక్టు ఉంది. జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. ఇన్ ఫ్లో : 1, 62, 529 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో : 54,191 క్యూసెక్కులు. ఇక, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు.

అయితే, ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్ 880.70 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి నిల్వ : 215.7080 టీఎంసీలు.. ప్రస్తుతం : 191.6512 టీఎంసీలు ఉండగా కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande