పాట్నా 8 జూలై (హి.స.)బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇక అధికారం కోసం ఎన్డీఏ, ఇండియా కూటమి పక్షాలు తీవ్రంగా శ్రమిస్తు్న్నాయి. నువ్వానేనా? అన్నట్టుగా బరిలోకి దిగబోతున్నాయి. ఇక మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అంతేకాకుండా ఇప్పటికే పలుమార్లు ప్రధాని మోడీ పర్యటించారు.
ఇక తాజాగా కేంద్రం బీహార్‌పై వరాల జల్లు కురిపించింది. బీహార్ రైల్వే అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. బీహార్‌కు 4 కొత్త అమృత్ భారత్ ట్రైన్లు నడపబోతున్నట్లు చెప్పారు. రూ.2000 కోట్లతో కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 104 కిలోమీటర్ల బక్తియార్పూర్ – రాజ్‌గిర్ – తిలైయా రైలు మార్గ డబులింగ్‌కు నిధులు మంజూరు చేశారు. ఈ రైలు మార్గ విస్తరణతో ప్రయాణికులకు లాభం జరగనుంది. ఇక స్థానికులకు కూడా ఉపాధి దొరకనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ