శ్రీ శైలం జలాశయానికి వరద పోటెత్తింది
శ్రీశైలం, 8 జూలై (హి.స.) సున్నిపెంట సర్కిల్‌ (శ్రీశైలం): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఫలితంగా శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం సుంకేశుల, జూరాల నుంచి 1,72,705 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోం
శ్రీ శైలం జలాశయానికి వరద పోటెత్తింది


శ్రీశైలం, 8 జూలై (హి.స.)

సున్నిపెంట సర్కిల్‌ (శ్రీశైలం): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఫలితంగా శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం సుంకేశుల, జూరాల నుంచి 1,72,705 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.60 అడుగులకు చేరింది. జలాశయం సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ఇప్పటికే 196.56 టీఎంసీల నీటితో కళకళలాడుతోంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ఉత్పత్తి చేస్తూ 67,563 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువ కావడంతో ఇవాళ ఉదయం శ్రీశైలం నుంచి రేడియల్‌ క్రస్ట్‌గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదల చేయనున్నారు. ఉదయం 11.50 గంటలకు కృష్ణమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి ఇచ్చిన తర్వాత గేట్లు ఎత్తనున్నారు. సీఎం రాక సందర్భంగా ఏర్పాట్లను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లె

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande