తిరుమల, 8 జూలై (హి.స.)
, : శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులతోపాటు వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలు, మత్స్యకార గ్రామాల్లో తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ (హెచ్‌డీపీపీ) ఆధ్వర్యంలో త్వరలో పుస్తక ప్రసాదాన్ని అందించేందుకు తితిదే ప్రణాళికలు చేస్తోంది. వేంకటేశ్వర స్వామివారిపై ఉన్న రచనలతోపాటు దేవతామూర్తుల స్తోత్రాలు, భజనలు, కథలు, భగవద్గీత పుస్తకాలు దాతల సహకారంతో అందించే అంశాన్ని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలిస్తున్నారు. ముందుగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వాటిని అందించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లోనూ పంపిణీచేసి, ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం, హిందూ ధర్మంపై అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ