హైదరాబాద్, 8 జూలై (హి.స.) రైతు సమస్యలపై చర్చిద్దాం రమ్మంటే తోక
ముడిచి తప్పించుకొని ఢిల్లీకి పారిపోయినవెందుకు? అయినా సవాల్ విసరడం.. బురదజల్లడం.. పారిపోవడం నీకు మొదటి నుంచి అలవాటే, నువ్వు రాకుంటే నీ మంత్రినైనా పంపు చర్చకు సిద్ధం..' అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మంగళవారం రైతు సమస్యలపై చర్చించేందుకు సోమాజిగూడ ప్రెసక్లబ్కు వెళ్లే ముందు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
ముఖ్య మంత్రి ముచ్చటపడితే తాను చర్చకు సిద్ధమయ్యాయని కేటీఆర్ స్పష్టం చేశారు. గతంలో ఎన్నోసార్లు సవాల్ విసిరి తప్పించుకుపోయిన విషయాన్ని గుర్తుచేశారు. 'కొడంగల్లో ఒడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేసి ఆరు నెలలు తిరగకముందే మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేస్తివి..హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంట అంటివి..అందుకే నువ్వు మాట మీద నిలబడే మనిషిని కాదు కాబట్టే నీ కొరిక మేరకు కొడంగల్లోనైనా, కొండారెడ్డిపల్లిలోనైనా, నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లోనైనా..అంబేద్కర్ చౌరస్తాలోనైనా, చివరికి అసెంబ్లీలోనైనా చర్చకు సిద్ధమని చెప్పినం.. కాదుపోదూ అంటే తటస్థ వేదిక అయినా ప్రెసక్లబ్కు మేమే వస్తమని చెప్పినం.. జూలై 8న 11 గంటలకు రమ్మని అడిగినం.. నువ్వు తప్పించుకపోతవని తెలుసు.. నీకు బేషజాలు తప్పా బేసిన్ల గురించి తెలియదని మూడు రోజుల టైమిచ్చినం.. అంటూ దెప్పిపొడిచారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్