నాంపల్లిలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ డిప్యూటీ టాక్స్ ఆఫీసర్ అరెస్ట్
హైదరాబాద్, 8 జూలై (హి.స.) మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్‎గా పని చేస్తోన్న సుధా ఓ కంపెనీకు సంబంధించిన జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయడానికి వచ్చిన వ్యక్తిని రూ.8 వేలు లంచం డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరక
ఏసీబీ దాడులు


హైదరాబాద్, 8 జూలై (హి.స.)

మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్‎గా పని చేస్తోన్న సుధా ఓ కంపెనీకు సంబంధించిన జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయడానికి వచ్చిన వ్యక్తిని రూ.8 వేలు లంచం డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు 2025, జూలై 8న హైదరాబాద్ నాంపల్లిలోని గగన్ విహార్‎లో సదరు వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా రైడ్స్ చేసి టాక్స్ ఆఫీసర్‎ సుధాను రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్నారు.

అనంతరం గగన్ విహార్‎లో తనిఖీలు చేశారు. నిందితురాలు సుధాపై కేసు నమోదు చేసి రిమాండ్‎కు తరలించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande